అన్నమయ్య: మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల నందు మెషిన్ లర్నింగ్లో పరిశోధన అవధులను అన్వేషించడం అంశంపై అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళాశాల డైరెక్టర్ డాక్టర్:ఎస్,రామలింగారెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. అనంతరం విద్యార్థుల పరిశోధన, ఆవిష్కరణలు పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.