KRNL: పత్తికొండలోని సెయింట్ పీటర్స్ బీఎడ్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు మునినాయుడు డిమాండ్ చేశారు. సోమవారం టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్డీఓ భరత్ నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కళాశాలలో 100% అడ్మిషన్లు ఉన్నా అధ్యాపకులు లేరని, సీట్లు పేమెంట్ కోట కింద అమ్ముతున్నారని మునినాయుడు ఆరోపించారు.