PPM: కొమరాడ మండలం గుణదతీలేసు పంచాయతీ శిఖవరం గ్రామంలో నూతన పాఠశాల భవన నిర్మాణానికి సోమవారం ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తుందని, విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అదనపు తరగతి గదులు నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వినర్, తదితరులు పాల్గొన్నారు.