PDPL: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది.