NZB: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సోమవారం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మున్సిపల్ కార్మికురాలు నాగమణినికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదం జరగగానే స్థానికులు, తోటివారు వెంటనే స్పందించి ఆమెను బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం NZB జిల్లా ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే ప్రాణాలు విడిచింది.