రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌పై విచారణ త్వరగా పూర్తిచేయాలని ఆయన లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. జైలులో కనీస సదుపాయాలు ఇవ్వట్లేదని, 20 బెయిల్ పిటిషన్లు వేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. విచారణ పూర్తి చేసి, మరణశిక్ష విధించినా తమకు సమ్మతమేనని స్పష్టంచేశారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసి తదుపరి విచారణను 29కి వాయిదా వేసింది.