MDK: కొల్చారం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 గొర్రెలు మృతి చెందాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన గొర్రెల కాపరి మల్లేష్ పటాన్ చెరు నుంచి గొర్రెలు మేపుకుంటూ వస్తున్నాడు. మెదక్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డుపై వెళ్తున్న గొర్రెల మందను ఢీకొనడంతో 22 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు మృతి చెందడంతో బాధితుడు ఆందోళన వ్యక్తం చేశారు.