PLD: నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు, ప్రజల నుంచి సమాచారం స్వీకరించి తక్షణ సహాయం అందించడానికి ఈ కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేస్తాయన్నారు. ఆయా మండలాల ప్రజలు తమ సమస్యల కోసం ఈ కేంద్రాలను సంప్రదించాలని అధికారులు కోరారు.