VZM: మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ టి. జయరాం సూచించారు. సోమవారం ఆయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా అత్యవసరం అయితే తప్ప ఎవరు ఇంటినుంచి బయటకు రావద్దని సూచించారు. 3 రోజులకు సరిపడా నిత్యావసర సరకులు సమకూర్చుకోవాలన్నారు. చంపావతి నది పరిసరాల్లోకి వెళ్లొద్దని సూచించారు.