CTR: గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ రేపు రెండు మండలాలలో పర్యటించనున్నట్లు ఆయన కార్యాలయం సోమవారం సాయంత్రం తెలిపింది. ఈ సందర్భంగా గంగాధర నెల్లూరు మండలంలో ఇల్లు కోల్పోయిన రాజేశ్వరి అనే మహిళకు ప్రభుత్వం తరఫున 50 వేలు ఆర్థిక సహాయం అందిస్తారు. అనంతరం శ్రీరంగరాజపురం మండలంలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి అర్జీలు స్వీకరిస్తారు.