BPT: కారంచేడులోని కృష్ణ కెనాల్ కాలువ కట్ట వద్ద నివాసముంటున్న ప్రజలను మంగళవారం ఎస్సై ఖాదర్ బాషా, ఎమ్మార్వో తో కలిసి స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోకి తరలించారు. తుఫాన్ తీరం దాటే వరకు ఇక్కడే ఉండాలని ఎస్సై వారికి సూచించారు. ఆహారంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పారు.