TG: మద్యం దుకాణాల ఎంపికకు డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా జిల్లాల కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం దరఖాస్తుల్లో మూడొంతులకు పైగా రాజధానితోపాటు దాని పరిసరాల్లోనే నమోదుకావడం గమనార్హం.