KMM: మధిర మున్సిపాలిటీ పరిధిలోని లడక్ బజార్ అయ్యప్ప స్వామి గుడి రోడ్లో ఉన్న విద్యుత్తు స్తంభం శిథిలావస్థకు చేరుకుంది. చిన్న గాలి వీచినా ఊగిపోతూ నిప్పురవ్వలు వస్తుండడంతో ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న స్తంభాన్ని మార్చాలని ప్రజలు విజ్ఞప్తి చేశారు.