BDK: దమ్మపేట మండలకేంద్రంలో జరుగుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను సోమవారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పరిశీలించారు. లైటింగ్ పనులు త్వరగా పూర్తయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించిందని పనులు నాణ్యతతో చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం చూపినా నాణ్యత తగ్గించినా సహించేది లేదని స్పష్టం చేశారు.