ATP: గుత్తి మున్సిపాలిటీలో అనధికార లేఔట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి 23వ తేదీ వరకు గడువు పెంచినట్లు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా బుధవారం మీడియాకు ఒక ప్రకటనలో తెలియజేశారు. క్రమబద్ధీకరణ చేసుకునే వారికి 50% రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.