BDK: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బుధవారం తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదల సంభవించే ప్రాంతాలను గుర్తించి ప్రజలను అధికారులు అప్రమత్తం చేయాలన్నారు.