KMM: ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో ప్రచారానికి కొందరు తన పేరు ఉపయోగిస్తుండడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు కూడా తాను యూనియన్లు, సంఘాల ఎన్నికల్లో జోక్యం చేసుకోలేదని, ఇప్పుడు కూడా అదే వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. చాంబర్ ఎన్నికల్లో ఎవరికీ తాను మద్దతు తెలపలేదనే విషయాన్ని గుర్తించాలని మంత్రి ఓ ప్రకటనలో సూచించారు.