JN: వాతావరణ శాఖ జనగామ జిల్లాకి ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కురుస్తున్న వర్షాల వల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ, మార్కెటింగ్, రెవిన్యూ, DRDO సంబందిత శాఖల అధికారులను ఈరోజు టెలి కాన్ఫెరెన్స్ ద్వారా ఆదేశించారు.