AP: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ వెళ్లారు. కల్తీ మద్యం కేసులో తన ప్రమేయం లేదని ప్రమాణం చేసేందుకు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. జనార్దన్ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్ చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమాణం చేస్తానని గతంలో ఆయన చెప్పిన విషయం తెలిసిందే.