KDP: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా, ఆదివారం వేంపల్లి పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందిస్తున్న సేవలు, వివిధ విభాగాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఐ టి. నరసింహులు తెలిపారు. విద్యార్థి దశలోనే పోలీస్ వ్యవస్థపై అవగాహన ఏర్పరచుకోవడం అవసరమని ఆయన అన్నారు.