ASR: పెదబయలు మండలం వంతర్భ గ్రామానికి అంగన్వాడీ భవనం మంజూరు చేయాలని గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు బాబూజీ కోరారు. ఈ మేరకు సోమవారం గ్రామస్తులతో కలిసి నిరసన తెలిపారు. గ్రామంలో సుమారు 40 మంది పిల్లలు ఉన్నారన్నారు. అయితే గ్రామంలో అంగన్వాడీ భవనం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గ్రామంలో ఓ గదిని అద్దెకు తీసుకుని అంగన్వాడీ నడిపిస్తున్నారన్నారు.