BDK: మణుగూరు మండల పరిధిలో 220 కేవీ టవర్ లైన్ పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ లేబర్‌ను ఎలాంటి సేఫ్టీ పరికరాలు లేకుండా ప్రమాదకరమైన ఎత్తైన టవర్లపై పని చేయిస్తున్నాడని స్థానికులు సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల భద్రత పట్ల పట్టింపు లేకుండా కేవలం ధనమే ధ్యేయంగా పనిచేస్తున్న కాంట్రాక్టర్‌పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.