KRNL: మొంథా తుపాను నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. తుఫాను సంసిద్ధతపై ఇవాళ అధికారులతో కలెక్టరేట్లో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. అవసరమైనప్పుడు వివిధ శాఖలకు సంబంధించిన మానవ వనరులు, సామగ్రి మెటీరియల్ పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు.