KMM: మధిర అంబారుపేటలో మొబైల్ పోగొట్టుకున్న యశోద అనే మహిళకు కేవలం 30 నిమిషాల్లోనే పోలీసులు ఫోన్‌ను తిరిగి అప్పగించారు. ఆటోలో ప్రయాణిస్తుండగా మొబైల్ పోవడంతో ఆమె ఫిర్యాదు చేశారు. ఎస్సై చంద్రశేఖర్ వెంటనే బ్లూ కోర్టు సిబ్బందితో ఫోన్‌ను ట్రేస్ చేయించారు. ఎస్సై సమక్షంలో మొబైల్‌ను తిరిగి అందుకొని యశోద పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.