సత్యసాయి: సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా పుట్టపర్తిలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పట్టణానికి స్వాగతం పలికే ప్రధాన మార్గాల్లో అందమైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తోరణాలు శతజయంతి వేడుకల వైభవాన్ని ప్రతిబింబించేలా తీర్చిదిద్దుతున్నారు. భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా, పుట్టపర్తిని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు.