ADB: నవజాత శిశు మరణాలను తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. సోమవారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన నూతన శిశు సంరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.నవజాత శిశు మరణాల రేటును సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గించేందుకు వైద్యులు అంకితభావంతో, నిబద్ధతతో పనిచేయాలని సూచించారు.