JGL: విధి నిర్వహణలో ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా ఉంటూ క్రమశిక్షణను పాటించాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా కోరుట్ల పోలీస్ స్టేషనన్ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఎస్పీ మట్లాడుతూ.. ప్రతి ఫిర్యాదుపై పోలీసులు తక్షణం స్పందించి బాధితులకు సత్వర న్యాయం జరిగేలా తగు చర్యలు తీసుకోవాలన్నారు.