E.G: తుఫాన్ కారణంగా వీచిన ఈదురుగాలులకు కోరుకొండ, సీతానగరం, గోకవరం మండలాల్లోని 892 ఎకరాలలో పంట దశకు వచ్చిన వరి పంట నేలకొరిగింది. 132 ఎకరాల్లో వరిపంట నీట మునిగినట్లు కోరుకొండ వ్యవసాయ సహాయ సంచాలకురాలు (ఏడీ) శశిబిందు తెలిపారు. నేలకొరిగిన వరి చేనుపై ఉప్పునీటి ద్రావణానం స్ప్రే చేసుకోవాలని రైతులకు ఆమె సూచించారు.