E.G: ప్రస్తుత తుఫాన్ ప్రభావం నేపథ్యంలో కలెక్టర్ కీర్తి చేకూరి సోమవారం రాజానగరం సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు విద్యుత్ సరఫరా వ్యవస్థలో ఎటువంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా సమన్వయంతో పని చేయాలన్నారు.