సత్యసాయి: ధర్మవరం నుంచి నవంబర్ 4న ఉ.6 గంటలకు అరుణాచలానికి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సు కాణిపాకం, అరుణాచల గిరి ప్రదక్షిణ, శివదర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో వేలూరు గోల్డెన్ టెంపుల్ మీదుగా ధర్మవరానికి చేరుకుంటుందని డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. ఒక్కొక్కరు రూ.1,400 చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.