HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో వెంగళరావు నగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థ నగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. BRSకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.