NZB: సిరికొండ మండలం గడ్కోల్ గ్రామంలో కుంటలు, చెరువులు, చెక్ డ్యాములపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్వో రాజీవ్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖిలో కుంటలతో, చెరువులతో, చెక్ డ్యాములతో కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులతో పాటు ఏఈవో శివాని, టీవో నవీన్ కుమార్, స్వామి పాల్గొన్నారు.