NZB: బోర్గాం(పి)లోని శ్రీ సాయి లక్ష్మీనగర్లోకి నిజాంసాగర్ కాలువ ద్వారా సాగునీరు వచ్చి చేరుతుందని కాలనీ వాసులు వాపోయారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ.. ఠాణాఖుర్దు నుంచి సాగునీరు కాలనీలోని ఇళ్ల ముందుకు చేరుతోందన్నారు.