సత్యసాయి: రొద్దం మండలంలో చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం ఉదయం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. మృతుడు మండలంలోని సుబ్బరామప్పగారి కొట్టాల గ్రామానికి చెందిన బోయ రామప్పగా గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.