కృష్ణా: గుడివాడ మండలం లింగవరం గ్రామంలో చిన్న గుడిసెలు, టెంట్లు,షెడ్లలో నివసిస్తున్న గ్రామస్తులకు ఎస్సై చంటిబాబు సోమవారం కౌన్సెలింగ్ ఇచ్చారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రమాదకర ప్రదేశాల్లో ఉండవద్దని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసు లేదా రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు.