MHBD: పెద్దవంగర నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ సోమవారం జిల్లా ఎస్పీ సుదీర్ రామ్నాథ్ కేకన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా నూతన ఎస్సైకి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, అక్రమ వ్యాపారాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.