NZB: బోధన్ పట్టణంలోని జూనియర్ కళాశాల ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై సోమవారం వరికోత యంత్రం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డివైడర్ మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపడింది. సమాచారం అందుకున్న బోధన్ పోలీసులు మున్సిపాలిటీ సిబ్బంది సహాయంతో వాహనాలకు ఇబ్బంది కలగకుండా స్తంభాన్ని పక్కకు జరిపారు.