మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహిస్తున్న పృథ్వీ షా రంజీ ట్రోఫీలో అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు. చండీఘడ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతను కేవలం 141 బంతుల్లోనే 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఇది రంజీ ట్రోఫీ చరిత్రలో రెండవ అత్యంత వేగవంతమైన ద్విశతకంగా నమోదైంది.