WGL: వరంగల్ నగరంలోని ఉర్సుగుట్ట వద్ద నాని గార్డెన్లో సోమవారం మద్యం షాపుల కేటాయింపుకు లాటరీ పద్ధతిలో డ్రా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేటకు చెందిన గంప రాజేశ్వర్ గౌడ్, ఆయన సతీమణి సాంబలక్ష్మి అదృష్టవశాత్తూ విజేతలుగా నిలిచారు. వారికి నర్సంపేట పరిధిలోని షాప్ నంబర్ 5, 38లు కేటాయించబడ్డాయి. దీంతో లక్కీ డ్రాలో గెలుపొందిన దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.