BDK: బియ్యం నిల్వలో ఎలాంటి తేడాలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తప్పవని సివిల్ సప్లై డీటీ శివకుమార్ హెచ్చరించారు. అశ్వాపురం మండల కేంద్రంలోని ఎంఎల్ఎస్ రైస్ పాయింట్‌ను వారు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు.