NLG: ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు, ఉపాధి హామీ పథకాలలో అవినీతిపై స్వతంత్ర విచారణ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేతావత్ బాబురామ్ అన్నారు. సోమవారం నేరేడుగొమ్ము మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రాధాన్యతల ఆధారంగా అర్హులైన గిరిజనులు, పేదలు, నిరుపేద కుటుంబాలకు ఇవ్వకుండా అనర్హులకు ఇస్తున్నారని అన్నారు.