NLR: తుఫాను నేపథ్యంలో బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కనిగిరి రిజర్వాయర్‌కు వరద నీరు చేరుతుంది. ఎగువ నుంచి సుమారు 1000 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో కనిగిరి రిజర్వాయర్ నిండుకుండలా మారింది. 3.5 టీఎంసీలు సామర్థ్యం ఉన్న కనిగిరి రిజర్వాయర్‌లో ప్రస్తుతం 2.4 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్టు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. దీంతో జలకల సంతరించుకుంది.