JGL: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ను మంగళవారం సారంగాపూర్ మండల అర్పపల్లి గ్రామ గౌడ సంఘం సభ్యులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కలిశారు. గౌడ సంఘం భవన అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న రూ. 5 లక్షల రూపాయల బిల్లులను మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, ధన్యవాదాలు తెలిపారు.