కోనసీమ: మొంథా తుఫాన్ నేపథ్యంలో పి.గన్నవరం సర్కిల్ పరిధిలో ప్రజలకు సీఐ భీమరాజు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలపై సర్కిల్ ఎస్సైలతో సమీక్ష నిర్వహించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అందరూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సీఐ సూచించారు. అవసరమైన సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు.