VZM: జామి మండలంలో మండల వైసీపీ అధ్యక్షులు, జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శి గొర్లె రవి ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో అట్టాడ, జాగరం, భీమసింగి, వెంకట రాజుపాలెం లో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తూ సంతకాలు సేకరిస్తున్నారు.