కోనసీమ: మొంథా తుఫాను నేపథ్యంలో కోనసీమ తిరుమల ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బందికి ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్ రావు తగు సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సోమవారం వాడపల్లి ఆలయంలోని అన్నదాన సాలను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.