దేశంలో వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల ఉన్మాదం భారత ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసిందన్నారు. మానవులపై జరిపే క్రూరత్వం గురించి ఏమంటారని పిటిషనర్లను ప్రశ్నించింది. ఈ క్రమంలో సుప్రీం నియమాలను అమలుచేసే చర్యలపై అఫిడవిట్లు సమర్పించని రాష్ట్రాల CSలకు సమన్లు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.