కోనసీమ: జిల్లాలో సోమవారం ఉదయం 9 గంటల నుండి వర్షాలు మొదలయ్యాయి. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించడంతో ఏపీఎస్ డిసిఎల్ ఉన్నతాధికారులు, ఏడిఈ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆలమూరు మండలంలో ఎలక్ట్రికల్ ఏఈ ప్రసాద్, లైన్ ఇన్స్పెక్టర్ సుబ్రమణ్యం, సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. విద్యుత్ స్తంభాలతో పాటు క్రేన్లను కూడా అందుబాటులో ఉంచారు.