KMR: బాల్య వివాహాల నిర్మూలనపై వచ్చే నెల నుంచి గ్రామసభలు నిర్వహించడం జరుగుతుందని బిక్కనూరు అభివృద్ధి అధికారి రాజ్ కిరణ్ రెడ్డి సోమవారం తెలిపారు. జిల్లాకు చెందిన చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ప్రతినిధిలు ఆయనకు గ్రామసభల వివరాలకు సంబంధించిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామాల్లో గ్రామసభ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.