MDK: పెద్ద శంకరంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే పనులపై గ్రామ సభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీవో సంతోష్ కుమార్ సూచించారు. ఉపాధి పథకంలో చేపట్టిన పనులను చర్చించి, చేపట్టనున్న పనులపై ప్రణాళికలను రూపొందించారు.